సంబంధిత వార్తలు
ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామరూన్ దర్శకత్వంలో సామ్ వర్తింగ్టన్, జోయి సల్డానా, సిగౌర్నీ వేవర్, స్టీఫెన్ లాంగ్ ప్రధాన పాత్రలలో ‘అవతార్’ ట్రైలర్ ‘ఫైర్ అండ్ యాష్’ సోమవారం విడుదలైంది. ఈ సినిమాలో కధ కంటే రకరకాల పాత్రలు, వాటి వేషధారణ, పోరాటాలు, అన్నిటికీ మించి అద్భుతమైన గ్రాఫిక్స్ ‘అవతార్’ని చాలా ఉన్నత స్థాయిలో నిలబెడతాయి.
ఈ సినిమాకు దర్శకత్వం: జేమ్స్ కామరూన్, కధ, స్క్రీన్ ప్లే: జేమ్స్ కామరూన్, రిక్ జఫ్ఫా, అమండా సిల్వర్, జోష్ ఫ్రెడ్ మ్యాన్, షేర్ సలేర్నో చేశారు.
ఈ ఏడాది డిసెంబర్ 19న అవతార్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.