హ్యాపీ బర్త్ డే డూడ్!

ప్రముఖ తెలుగు సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తొలిసారిగా తమిళం తీస్తున్న సినిమా ‘డూడ్‌.’ తమిళ్ మైత్రీ ప్రొడక్షన్: 4గా తీస్తున్న ‘డూడ్’లో యువనటుడు ప్రదీప్, మమిత బైజు జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో శరత్ కుమార్‌, రోహిణీ మోలెట్టి,   ద్రావిడ్ సెల్వం, సురేష్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

ఈ రోజు ప్రదీప్ పుట్టిన రోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే డూడ్!’ అంటూ ఓ పోస్టర్‌ వేసి శుభాకాంక్షలు తెలియజేసింది నిర్మాణ సంస్థ.  

ఈ సినిమాకి కధ, దర్శకత్వం కీర్తీస్వరన్, సంగీతం: సాయి అభయంకర్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘డూడ్‌’ ఈ ఏడాది దీపావళికి 5 భాషల్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.