ఎన్టీఆర్ కి ఇది అవమానమే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే సౌత్ లో ఎవరికి తెలియదు చెప్పండి. ఈ మధ్యనే జనతా గ్యారేజ్ తో మలయాళంలో కూడా తన సత్తా చాటాడు. కెరియర్ స్టార్టింగ్ లోనే రికార్డుల పని పట్టిన తారక్ ఇప్పుడు మళ్లీ అదే రేంజ్ సూపర్ సక్సెస్ ను అందుకుని ఫాంలోకి వచ్చాడు. అయితే ఈ సక్సెస్ జోష్ లో ఉన్న జూనియర్ ను ఓ తమిళ దర్శకుడు ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదు అని చెప్పడం హాట్ న్యూస్ గా మారింది. తన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేసి హిట్ కొడుతున్న ఆ డైరక్టర్ కు యంగ్ టైగర్ తెలియకపోవడం ఏంటని అందరు షాక్ అవుతున్నారు.   

తెలుగు సినిమా స్టార్ హీరోల్లో ఎన్నో పొజిషన్ ఏంటి అన్నది చెప్పలేం కాని కచ్చితంగా నెంబర్ రేసులో తారక్ కూడా ఉంటాడు. అలాంటిది తమిళ దర్శకుడు సింగం సీరీస్ లను తీస్తూ హిట్ అందుకున్న డైరక్టర్ హరి, తారక్ ఎవరో తెలియదు అనడం కాస్త అతి చేయడమే అంటున్నారు. తెలుగులో తమ సినిమాలను రిలీజ్ చేస్తూ ఇక్కడ స్టార్ హీరో గురించి కూడా తెలియనంత విచిత్రం ఇంకెక్కడైనా ఉంటుందా.    

ఈమధ్య హరి డైరక్షన్లో తారక్ సినిమా ఉంటుందని మీడియా హడావిడి చేసింది. ఇక సింగం 3 అదేనండి ఎస్-3 ప్రమోషన్స్ లో పాల్గొన్న హరి అసలు తనకు ఎన్టీఆర్ ఎవరో కూడా తెలియదు అన్నట్టు మాట్లాడాడు. మరి మనోడు అన్నాడు సరే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించలేదు పాపం.