మహేష్ సినిమాలో కూడా ఆ సీన్ రిపీట్..!

సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. శ్రీమంతుడు తర్వాత రాబోతున్న ఈ కాంబోపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ క్రమంలో మహేష్ కోసం అద్భుతమైన కథ రాసుకున్న కొరటాల శివ జనతా గ్యారేజ్ హిట్ లో ముఖ్య పాత్ర పోశించిన రాజీవ్ కనకాల సీన్ లాంటి ఎపిసోడ్ మళ్లీ మహేష్ సినిమాలో కూడా రాసుకున్నాడట.

ఓ సిన్సియర్ ఆఫీసర్ గురించి వచ్చే ఆ సీన్ అందరు కనెక్ట్ అవుతారు. అదే తరహాలో మహేష్ సినిమాలో కూడా ఓ అద్భుతమైన సీన్ రాసుకున్నాడట కొరటాల శివ. భరత్ అను నేను టైటిల్ ప్రచారం జరుగుతున్నా చిత్రయూనిట్ మాత్రం ఆ టైటిల్ కన్ఫాం చేయలేదు. రీసెంట్ గా ముహుర్తం పెట్టుకున్న ఈ సినిమా ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మరి భారీ అంచనాలతో రాబోయే ఆ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.   

ప్రస్తుతం మహేష్ మాత్రం మురుగదాస్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. నిన్నటి దాకా హైదరాబాద్, చెన్నై పరిసర ప్రాతాల్లో షూటింగ్ జరుపుకున్న చిత్రయూనిట్ ఇప్పుడు అహ్మదాబాద్ కు షిఫ్ట్ అయ్యింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధులు నిర్మిస్తున్నారు.