ఎస్ఎస్ఎంబీ 29 ఫస్ట్ గ్లిమ్స్‌?

రాజమౌళి ఇంతవరకు పాన్ ఇండియా స్థాయి సినిమాలు తీశారు. వాటికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.  ఆదరణ లభించింది. కనుక ఈసారి మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో తీస్తున్న సినిమాని అంతర్జాతీయస్థాయిలోనే నిర్మిస్తున్నారు. తెలుగు సినిమా పాటలు, ఫైట్స్ విదేశాలలో షూటింగ్ చేయడం చాలా కామన్ కానీ ఈ సాహసయాత్ర కధ అనేక దేశాలలో సాగుతుంది కనుక ఇది చాలా ప్రత్యేకం. 

సాధారణంగా రాజమౌళి సినిమాలు పూర్తయ్యేవరకు పెద్దగా అప్డేట్ ఇవ్వరు. కానీ ఆగస్ట్ 9న ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్‌ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. కానీ ఈ వార్తని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. 

ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, పృధ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. 

ఈ సినిమాకు కధ: విజయేంద్ర ప్రసాద్, సంగీతం: కీరవాణి, డైలాగ్స్: దేవాకట్ట అందిస్తున్నారు. సుమారు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో కె ఎల్ నారాయణ ఈ సినిమా నిర్మిస్తున్నారు.