విశ్వంభరలో స్పెషల్ బాలీవుడ్‌ బ్యూటీ మౌనీరాయ్

మల్లాది వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘విశ్వంభర’ సోషియో ఫాంటసీ మూవీ షూటింగ్‌ ఎప్పుడో పూర్తయింది. ఈ సినిమాని ఈ ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల చేద్దామనుకున్నారు.

గేమ్ ఛేంజర్‌ కోసం వాయిదా అన్నారు. కానీ సీజీ వర్క్స్ పూర్తికాక పోవడం వలన సినిమా వాయిదా పడిందని తర్వాత చల్లగా చెప్పారు. తాజా సమాచారం ఏమిటంటే ఈ సినిమాలో ఇంకా ఓ స్పెషల్ సాంగ్ కూడా చిత్రీకరించాల్సి ఉందట. దీని కోసం బాలీవుడ్‌ బ్యూటీ మౌనీరాయ్‌ని ఖరారు చేసి ఈ నెలాఖరు నుంచి పాట చిత్రీకరణ ప్రారంభించనున్నారు. దీనిలో ఆమె మెగాస్టార్ చిరంజీవితో డాన్స్ చేయబోతోంది.      

విశ్వంభరలో  త్రిష, ఆషికీ రంగనాధ్ హీరోయిన్లుగా చేస్తున్నారు. కునాల్ కపూర్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా, సంగీతం: కీరవాణి, కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు. 

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి కలిసి రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో విశ్వంభర విడుదలయ్యే అవకాశం ఉంది.