
బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా చేస్తున్న ‘పెద్ది’ సినిమాలో మరో స్టార్ హీరో చేరారు. ఆయనే ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు గౌరు నాయుడు. పెద్ది (రామ్ చరణ్)కి కోచ్‌గా నటిస్తున్నారు.
హైదరాబాద్‌లో పెద్ది షూటింగులో తాను కూడా రెండు రోజులుగా పాల్గొంటున్నాని, తొలిసారిగా తెలుగు సినిమాలో నటిస్తున్నానని, తొలిసారిగా తెలుగులో డైలాగ్స్ చెప్పానని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. పెద్దిలో నాకు చాలా మంచి పాత్ర ఇచ్చారు. దర్శకుడు బుచ్చిబాబు, రామ్ చరణ్‌లతో కలిసి పనిచేస్తుండటం చాలా సంతోషం కలిగిస్తోందన్నారు.
ఈ సినిమాలో జగపతి బాబు, శివ రాజ్ కుమార్, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి అందిస్తున్నారు.
వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు.
వచ్చే ఏడాది మార్చి 27న సినిమా విడుదల చేయబోతున్నట్లు ఫస్ట్ గ్లింమ్స్‌లోనే ప్రకటించారు.
Happy Birthday @NimmaShivanna garu !! ❤️❤️
— Ram Charan (@AlwaysRamCharan) July 12, 2025
'GOURNAIDU' will be celebrated and loved.
Honoured to be sharing screen with you in #Peddi.🙏 pic.twitter.com/W0FRhkmpvd