విశాఖలో మల్టీ ప్లెక్స్ నిర్మిస్తున్న అల్లు అర్జున్‌

పుష్పతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్‌ ఇప్పటికే హైదరాబాద్‌లో అమీర్ పేట జంక్షన్ వద్ద ఓ మల్టీ ప్లెక్స్ ఉంది. ఇప్పుడు ఏపీలోని విశాఖ నగరంలో కూడా ఓ ఓ మల్టీ ప్లెక్స్ నిర్మించబోతున్నాయి. విశాఖలో దక్షిణాది రాష్ట్రాలలో అతిపెద్దదైన ఈనార్బిట్ మాల్ నిర్మాణం జరుగుతోంది. మొత్తం 13 ఎకరాలలో దీనిని నిర్మిస్తున్నారు. దానిలోనే ఆసియన్ ఆల్లు అర్జున్ పేరుతో 8 స్క్రీన్స్ తో మల్టీ ప్లెక్స్ నిర్మించబోతున్నారు.

దీనిలో ఉపయోగించే ఫర్నీచర్, ఇంటీరియర్ డిజైనర్లని కూడా విదేశాల నుంచి రప్పిస్తున్నారని సమాచారం. 2026 వేసవి నాటికి ఈనార్బిట్ మాల్ నిర్మాణం, దాంతో బాటు ఈ మల్టీ ప్లెక్స్ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.  

అల్లు అర్జున్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఏఏ 22 అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా ప్రారంభించబోతున్నారు. దీనిని సుమారు రూ.800-1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు.  ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ దీపీకా పడుకొనే హీరోయిన్‌గా నటించబోతోంది.