వీసా.. వింటారా సరదాగా..

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇచ్చి అప్పుడే మూడో సినిమాకి వచ్చేశాడు. హీరో సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టిన అశోక్ గల్లా తర్వాత దేవకీ నందన వాసుదేవతో రెండో సినిమా పూర్తిచేసుకొని ఇప్పుడు “వీసా.. వింటారా సరదాగా’ అనే మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 

ఈ సినిమాతో ఉద్భవ్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ యూత్ ఫుల్ కామెడీ సినిమాలో శ్రీగౌరీ ప్రియ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ శనివారం ఉదయం 10.53 గంటలకు విడుదల కాబోతోంది.  

అమెరికాలో చదువు, ఉద్యోగం చేసి అక్కడే స్థిరపడాలనుకునే యువత కలలు, కష్టాలను కధగా మార్చి ఈ సినిమా తీశారు.