కొత్తపల్లిలో ఒకప్పుడు.. ట్రైలర్ కూడా వచ్చేసింది!

ప్రవీణ్ పరుచూరి దర్శకత్వంలో రవీంద్ర విజయ్, బెనర్జీ, బొంగు సత్తి, ఫణి, ప్రేమ్ సాగర్ ముఖ్యపాత్రలు చేసిన ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’  టీజర్ ఇటీవలే విడుదల కాగా ఇప్పుడు ట్రైలర్ కూడా వచ్చేసింది. గ్రామీణ నేపధ్యంలో సాగే చక్కటి సినిమా ఇదని ట్రైలర్ చూస్తే అర్దమవుతుంది. 

మనోజ్ చంద్ర, మోనిక, ఉష బోనెల ఈ సినిమాతో నటీనటులుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో పల్లెటూరి గడుసుపిల్ల సావిత్రిగా ఉష బోనెల నటించింది.   

పరుచూరి విజయ ప్రవీణ ఆర్ట్స్ బ్యానర్‌పై గోపాలకృష్ణ పరుచూరి, ప్రవీణ పరుచూరి కలిసి నిర్మించిన ఈ సినిమాని ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా సమర్పిస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, డైలాగ్స్: గురుకిరణ బాతుల, సంగీతం: మణిశర్మ, కెమెరా: పెట్రోలస్ ఆంటోనియాడిస్, కొరియోగ్రఫీ: వై మెహర్ బాబా, ఎడిటింగ్: కిరణ్ ఆర్‌, స్టంట్స్: మార్వెల్ నటరాజ చేశారు.  ఈ నెల 18న కొత్తపల్లిలో ఒకప్పుడు ఎలా ఉండేదో చూపించబోతున్నారు.