జూలై 31న కింగ్‌డమ్‌ రిలీజ్‌.. ప్రమో!

గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ‘కింగ్‌డమ్‌’ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ విషయం తెలియజేస్తూ కింగ్‌డమ్‌ రిలీజ్‌ ప్రమో కూడా విడుదల చేయడంతో, తమ అంచనాలకు మించి ఉన్న ఆ ప్రమోని చూసి విజయ్ దేవరకొండ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.  

ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా భాగ్యశ్రీ భోరే నటించగా రుక్మిణీ వసంత్ కీలకపాత్ర చేసింది. దీపక్ మహత, కేశవ్ దీపక్, మణికంఠ వారణాసి ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేశారు. 

సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించిన ఈ సినిమాకు సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, కెమెరా: గిరీష్‌ గంగాధరన్‌, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: కొల్ల అవినాష్ చేశారు.