
మాన్లీ స్టార్ గోపిచంద్ సంపత్ నంది డైరక్షన్లో చేస్తున్న మూవీ గౌతం నంద.. సినిమాలో రెండు విభిన్న పాత్రలు చేస్తున్న గోపిచంద్ హీరోయిన్స్ హాన్సిక, కేథరిన్ త్రెసాలతో రొమాన్స్ చేస్తున్నాడు. కేథరిన్ త్రెసా పాత్ర ఏమో కాని హాన్సిక మాత్రం లీడ్ రోల్ అని చెప్పేయొచ్చు. కోలీవుడ్ లో స్టార్ క్రేజ్ ఉన్నా టాలీవుడ్లో తన రేంజ్ హిట్ అందుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది హాన్సిక. ఇక్కడ తెరంగేట్రం చేసి అక్కడ హిట్ అయిన అమ్మడు తన ఆశలన్ని గోపిచంద్ సినిమా మీద పెట్టుకుంది.
ఈమధ్యనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా చివరిరోజు షూటింగ్ లో గోపిచంద్ తో దిగిన పిక్ సోషల్ సైట్స్ లో షేర్ చేసింది హాన్సిక. బైక్ మీద ఉన్న గోపిచంద్, హాన్సిక భలే క్రేజీగా ఉన్నారు. తన మార్క్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్ తో హిట్స్ కొడుతున్న సంపత్ నంది గోపిచంద్ కు గౌతం నందతో కచ్చితంగా హిట్ ఇస్తాడని నమ్ముతున్నారు ఫ్యాన్స్.
ఇక హాన్సిక కూడా సినిమా గురించి చాలా ఎక్సయిటింగ్ గా ఉందట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన చిత్రయూనిట్ త్వరలో రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తుంది.