ఇదో వింత పబ్లిసిటీ..!

తెలుగు దర్శకుల్లో రవిబాబు స్టైలే వేరు.. సైలెంట్ గా తన సినిమాలను చేసుకుంటూ సర్ ప్రైజ్ హిట్స్ అందుకునే రవిబాబు ప్రస్తుతం పందిని హీరోగా పెట్టి అదుగో సినిమా చేస్తున్నాడు. పిగ్గెట్ అని చిన్నగా తీసి పారేయొద్దు అంటూ ఓ ప్రయోగమే చేస్తున్న రవిబాబు.. సినిమా ఎనౌన్స్ మెంట్ తోనే కావాల్సిన పబ్లిసిటీ తెచ్చుకున్నాడు. ఇక ఈ క్రమంలో ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా ఉన్న నోట్ల రద్దు దాని వల్ల జనాలు పడుతున్న కష్టాలను కూడా తన సినిమాకు పబ్లిసిటీగా వాడుకునేందుకు ఏ.టి.ఎం క్యూ లైన్లో తన సినిమా హీరో పందితో లైన్లో నిలబడ్డాడు.  

ఓ విధంగా చెప్పాలంటే పంది లేకుండా క్యూలో నిలబడితే సరిపోద్ది కాని తన సినిమా పబ్లిసిటీకి ఈ సిచ్యువేషన్ ఉపయోగపడాలని రవిబాబు ఈ కొత్త తరహా ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. సాధారణంగా ఎవరైనా తమ పెట్స్ అంటే కుక్కలను వెంటతెచ్చుకుంటారు కాని రవిబాబు మాత్రం పందితో క్యూలో నిలుచున్నాడు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉన్న అదుగో మూవీకి ఈ రకంగా ప్రమోట్ చేసి సినిమా మీద ఆడియెన్స్ కన్ను పడేలా చేస్తున్నాడు రవిబాబు.    

ఈ డైరక్టర్ ప్రమోషన్ ట్రిక్స్ ఎంతవరకు వర్క్ అవుట్ అయ్యయో తెలియదు కాని అదుగో సినిమా మాత్రం రాజమౌళి ఈగకు పోటీ ఇస్తుంది అని ఫిల్మ్ నగర్ లో హాట్ న్యూస్. రవిబాబు బడ్జెట్ తో జక్కన్న ఈగకు పోటీ ఇచ్చాడా లేదా అన్నది సినిమా వస్తేనే గాని చెప్పలేం.