ఆ ఛాన్స్ మిస్ చేసుకున్న స్వాతి..!

కలర్స్ ప్రోగ్రాంతో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చి తన చార్మింగ్ తో హీరోయిన్ గా క్రేజ్ సంపాదించిన స్వాతి ప్రస్తుతం కెరియర్ అటు ఇటుగా ఉంది. అరకొర అవకాశాలు వస్తున్నా అవి కూడా ఆశించిననత ఫలితాన్ని అందించకపోవడంతో స్వాతి దాదాపు ఫేడవుట్ అయినట్టే అంటున్నారు. ఈ మధ్యనే ఓ లక్కీ ఛాన్స్ వచ్చినా సరే మిస్ చేసుకున్న ఈ భామ ఇప్పుడు ఆ సినిమాలో తను చేయాల్సిన పాత్ర హిట్ అయ్యే సరికి ఇప్పుడు బాధపడుతుంది. 

రీసెంట్ గా నిఖిల్ హీరోగా సూపర్ హిట్ అయిన సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడా విఐ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో క్లైమాక్స్ లో రివీల్ అయ్యే అవికా గోర్ క్యారక్టర్ కు ముందు స్వాతినే అడిగారట. స్వామి రారా, కార్తికేయ సినిమాలతో హిట్ అందుకున్న నిఖిల్ ఆ రెండు సినిమాలకు స్వాతినే పెయిర్ అవ్వడంతో ఈసారి కూడా అది హిట్ పెయిర్ అవుతుందని ముందు అవికా రోల్ కు ఆమెనే అడిగారట. కాని చిన్న పాత్ర అంటూ ఆమె తప్పించుకుంది.

తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే సినిమా మొత్తం ఉన్న హెబ్భా, నివేదా శ్వేతల కన్నా కేవలం పది నిముషాలున్న అవికా రోల్ సూపర్ క్లిక్ అయ్యింది. మరి అవకాశాలు లేవు లేవు అంటూనే తన దాకా వచ్చిన హిట్ సినిమాను మిస్ చేసుకుంది స్వాతి. ఈమధ్యనే సన్నబడటానికి కుస్తి పడుతున్న ఈ అమ్మడు ఫ్యూచర్లో ఎలాంటి అవకాశాలను అందుకుంటుందో చూడాలి.