
జనతా గ్యారేజ్ హిట్ తో ఎంత జోష్ గా ఉన్నాడో అంత కన్ ఫ్యూజన్ లో పడ్డాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దర్శకులతో కథా చర్చలు కొనసాగిస్తున్నా తనను ఇంప్రెస్ చేసే కథ దొరకక ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఈ టైంలోనే రవితేజ పవర్ డైరక్టర్ కె.ఎస్ రవింద్ర ఓ అదిరిపోయే లైన్ చెప్పాడట. లైన్ నచ్చేయడంతో పూర్తి కథ సిద్ధం చేయమన్నాడట తారక్. రచయితగా ఉన్న బాబి పవర్ సినిమాతో దర్శకుడిగా మారి తన సత్తా చాటుకున్నాడు. ఇక సెకండ్ ఛాన్స్ గా పవర్ స్టార్ తో సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చినా అది ఫ్లాప్ అయ్యింది.
కాస్త గ్యాప్ తీసుకుని మరో అద్భుతమైన కథతో తారక్ కు షాక్ ఇచ్చాడట బాబి. అసలైతే మొన్నామధ్య బాబి మళ్లీ రవితేజతో సినిమా తీసేందుకు సన్నాహాలు చేశారు కాని ఏమైందో ఏమో ఆ సినిమా అటకెక్కింది. ఇక ప్రస్తుతం తారక్ సినిమా మీద దృష్టి పెట్టిన బాబి దాదాపు ఓకే అయినట్టే అని అంటున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత బాబి డైరక్షన్లో తారక్ మూవీ అంచనాలకే అందని ఈ క్రేజీ కాంబోలో వచ్చే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి.