నేడు చెన్నైలో అట్టహాసంగా కుబేరా ఆడియో లాంచ్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున,ధనుష్, రష్మిక ప్రధాన పాత్రలలో జూన్ 20న వస్తున్న ‘కుబేర’ ఆడియో లాంచ్ ఫంక్షన్ ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి చెన్నైలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో జరుగబోతోంది.

ఇప్పటికే విడుదలైన పోయిరా మావా అంటూ సాగే మాస్ బీట్ సాంగ్‌కు, దానికి ధనుష్ చేసిన డాన్స్ వైరల్ అవుతోంది. ఇటీవల ట్రాన్స్ ఆఫ్ కుబేరా అంటూ 5 భాషల్లో ఆడియోని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చారు.

ఈరోజూ ఆడియో లాంచ్ ఫంక్షన్‌లో దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రేక్షకులకు మరేమైనా సర్‌ప్రైజ్ సిద్దం చేసి ఉంచారా? సినిమా గురించి ఏం చెపుతారని సినీ ప్రియులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.     

డబ్బున్నవాడు, ఏమీ లేని నిరుపేద కూడా ఈ లోకం నాదే అనుకుంటాడు. ఆ ఇద్దరి ప్రపంచాలు వేర్వేరు. వారి ప్రపంచాలను డబ్బు ఏవిదంగా శాసిస్తోంది? అని కుబేరాలో చూపబోతున్నారు.  

ఈ సినిమాలో రష్మిక మందన, జిమ్ సరబ్, సాయాజీ ఏక్‌నాధ్ షిండే తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి కధ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి, దర్శకత్వం: శేఖర్ కమ్ముల, సంగీతం: దేవి శ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి చేస్తున్నారు. 

శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి అమిగోస్ క్రియెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ రావు కలిసి ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. జూన్ 20న కుబేరా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.