
కెఎస్కె చైతన్య దర్శకత్వంలో సంగీత్ శోభన్ హీరోగా వస్తున్న చిత్రం గ్యాంబ్లర్. ఈ సినిమాలో ప్రశాంతి చారువోలింగా, శ్రీకాంత్ అయ్యంగార్, సూర్యభగవాన్ దాస్, మల్హోత్రా శివ, ఛత్రపతి శేఖర్, పృధ్వీరాజ్ బన్నా, సాయి శ్వేత, రాకింగ్ రాకేశ్, శివారెడ్డి, మధుసూధన్ రావు, తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఆదివారం విడుదల చేశారు. ఇదో క్రైమ్ కామెడీ సినిమా అని ట్రైలర్ సూచిస్తోంది.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: విజయ్ చిట్నీడ్, పాటలు: కిట్టు విశ్వా ప్రగడ, సంగీతం: శశాంక్ తిరుపతి, కెమెరా: ప్రేమ్ సాగర్, కొరియోగ్రఫీ: నిక్సన్ డీ’ క్రూజ్, ఎడిటింగ్: శశాంక్ మాలి, యాక్షన్: వింగ్ చున్ అంజి చేశారు.