
నటి సమంత నిర్మాతగా మారి నిర్మించి, నటించిన తొలి సినిమా శుభం ఇటీవల థియేటర్లలో విడుదలై మెప్పించింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను మెప్పించేందుకు జియో హాట్ స్టార్లోకి రాబోతోంది. ఈ నెల 13 నుంచి జియో హాట్ స్టార్లో శుభం ప్రసారమవుతుందని ఆ సంస్థ ప్రకటించింది.
ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో వచ్చిన ‘శుభం’ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవీరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
కధేమిటంటే, దేశంలో కొత్తగా డిష్ టీవీ ఛానల్స్ పరిచయం అవుతున్న ఆ రోజుల్లో భీమునిపట్నంలో ముగ్గురు స్నేహితుల ఇళ్ళలో టీవీ సీరియల్స్ వస్తున్న సమయంలో వారి భార్యలు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఈ సీరియల్ చూసి ఇంట్లో ఆడవాళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తుండటంతో పరిష్కారం కోసం మాయమాతా శ్రీ (సమంత) వద్దకు వెళతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన సినిమా కధ. ఎలాగూ ఓటీటీలోకి వచ్చేస్తోంది కదా? తినబోతు గారెలా రుచు ఎలా ఉందని అడగడం దేనికి? ఓటీటీలో చూసి ఆనందించండి.