సంబంధిత వార్తలు

నాగ శివ దర్శకత్వంలో అర్జున్ అంబటి, జెనీఫర్ ఇమ్మానుయేల్ జంటగా చేసిన పరమపద సోపానం సినిమా నుంచి చిన్ని చిన్ని తప్పులేవో.. అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ఈరోజు విడుదలైంది. ఈ పాటలో హీరోయిన్ అందాలను ఆరబోసేసింది. కనుక రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువగానే ఉంది.
రాంబాబు గోశాల వ్రాసిన ఈ పాటని దావ్ జండ్ సంగీతం అందించగా పృధ్వీ చంద్ర, అదితి భావరాజు ఆలపించారు.
ఈ సినిమాకు సంగీతం: దావ్ జండ్, కెమెరా: ఈశ్వర్, ఎడిటింగ్: గౌతంరాజు నరేసు చేశారు. ఎస్ఎస్ మీడియా బ్యానర్‌పై గుడిమిట్ల శివప్రసాద్, గుడిమిట్ల ఈశ్వర్ కలిసి నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.