సంబంధిత వార్తలు

ఫణీంద్ర నర్సెట్టి కధ, దర్శకత్వంలో జూన్ 20న వస్తున్న సినిమా 8 వసంతాలు. అనంతిక సనీల కుమార్, రవితేజ దుగ్గిరాల, హనురెడ్డి, కన్నా పసునూరి ప్రధాన పాత్రలు చేసిన ఈ సినిమా ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ అని నాలుగు నెలల క్రితం విడుదల చేసిన టీజర్‌తో చెప్పేశారు. ఆ ఒక్క టీజర్‌తోనే సినిమాపై అంచనాలు పెరిగాయి. కనుక 8 వసంతాలు తప్పకుండా ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా నిలుస్తుందని ఆశించవచ్చు.
ఈ సినిమాకు సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహిబ్, కెమెరా: విశ్వనాథ్ రెడ్డి, ఎడిటింగ్: శశాంక్ మాలి చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ పోలిశెట్టి ఎర్నేని, వైసీపీ రవిశంకర్ కలిసి ఈ సినిమా నిర్మించారు.