3.jpeg)
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. రామోజీ ఫిలిమ్ సిటీలో ఫౌజీ కోసం 5 సెట్స్ వేశారు. వాటిలో ఓ పెద్ద జైల్ సెట్ కూడా ఉంది.
ఇవి కాక తెలుగు సినీ పరిశ్రమకు సెంటిమెంటుగా మారిన హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కూడా మరో 5 సెట్స్ వేశారు. ఈ రెండు చోట్ల షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ జూన్ 5టో ముగుస్తుంది. తర్వాత విదేశాలలో షూటింగ్ కోసం వెళ్ళవచ్చని తెలుస్తోంది.
ఫౌజీలో ప్రభాస్‌కు జోడీగా కొత్త హీరోయిన్ ఇమాన్వీ నటిస్తోంది. అలనాటి అందాల నటి జయప్రద, బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకి సంగీత దర్శకత్వం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ కలిసి ఫౌజీ నిర్మిస్తున్నారు.