
సినీ పరిశ్రమలో ఎన్నో సమస్యలు పట్టిపీడిస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని స్వయంకృతాలు మరికొన్ని అవాంఛనీయ కారణాల వలన కలిగేవి. అవాంఛనీయ జాబితాలో అగ్రస్థానంలో పైరసీ ఉందనుకుంటే, అనూహ్యంగా అంతకంటే దారుణం జరిగింది. అదే.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా హార్డ్ డిస్క్ దొంగతనం.
సుమారు గంటన్నర నిడివి కన్నప్ప సినిమా దానిలో ఉంది. దానిని ట్వంటీ ఫర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేసే రఘు అనే ఉద్యోగి దొంగతనం చేసి కనిపించకుండా పోయాడు. ఆ సంస్థ అధినేత రెడ్డి విజయ్ కుమార్ వెంటనే ఫిలిమ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు.
కానీ ఆ హార్డ్ డిస్క్ రెండు రోజుల క్రితం దొంగతనం అయ్యింది కనుక ఇప్పటికే కాపీలు తయారుచేసి బయటకు వెళ్ళిపోయే ఉంటాయి. కనుక ఆ హార్డ్ డిస్క్‌ని పోలీసులు కనుగొన్నా జరగకూడని నష్టం జరిగిపోయే ఉంటుంది.
మంచు విష్ణుకి తన పరిస్థితి అర్ధమయినట్లుంది.. అందుకే ఆవేదనతో ఎక్స్ వేదికగా కన్నప్ప పోస్టర్ పేరుతో తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలా పెట్టాడు..