బద్మాషులు ట్రైలర్‌.. మనకి మరి కొన్ని జాతిరత్నాలే?

శంకర్ చేగూరి దర్శకత్వంలో మహేష్ చింతల, విద్యాసాగర్ రావు, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలలో ‘బద్మాషులు’ సినిమా జూన్ 6 న విడుదల కాబోతోంది. నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ చూస్తే ‘జాతి రత్నాలు’ వంటి మరో వినోదభరితమైన సినిమా చూడబోతున్నామనిపిస్తుంది. 

తెలంగాణ గ్రామీణ నేపధ్యంతో వస్తున్న ‘బద్మాషులు’ ఒక ఊర్లో ఇద్దరు చిల్లర దొంగలు-పోలీస్ కేసు అనే పాయింట్ చుట్టూ కధ అల్లుకున్నట్లు ట్రైలర్‌ చెపుతోంది. ట్రైలర్‌లో మహేష్ చింతల, విద్యాసాగర్ రావు ఇద్దరు చిల్లర దొంగల్లా నటించగా, మురళీధర్ గౌడ్ పోలీస్ కానిస్టేబుల్‌గా నటించారు. ముగ్గురి మద్య సన్నివేశాలు, సంభాషణలు, కామెడీ చాలా బాగుంది. ఇదేవిదంగా సినిమా ఉంటే మనకి మరో రెండు కొత్త జాతి రత్నాలు దొరికినట్లే.            

ఈ సినిమాలో కవిత శ్రీరంగం, దీక్ష కోటేశ్వర, అంజయ్య, సుధాకర్ రెడ్డి, గుండా మల్లయ్య తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

ఈ సినిమాకి సంగీతం: తేజ కునూరు, కొరియోగ్రఫీ: చార్లీ రఘురామ కృష్ణరాజు స్టార్,  కెమెరా: వినీత్ పబ్బతి, ఎడిటింగ్: గజ్జల రక్షిత్ కుమార్‌, ఆర్ట్: మురళి ఇంద్రపల్లి చేశారు. 

సితారా స్టోరీ టెల్లర్స్ బ్యానర్‌పై బి బాలకృష్ణ, సి. రామశంకర్ కలిసి ఈ సినిమా నిర్మించారు.