
శేఖర్ కమ్ముల-నాగార్జున-ధనుష్ కాంబినేషన్లో ‘కుబేర’ టీజర్ ఈరోజు విడదలైంది. డబ్బున్నవాడు ఈ లోకమంతా నాదే అనుకుంటాడు. ఏమీ లేని నిరుపేద కూడా ఈ లోకం నాదే అనుకుంటాడు. ఆ ఇద్దరూ ఒకరి ప్రపంచంలో మరొకరు ప్రవేశిస్తే అనే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కించినట్లు టీజర్ చెపుతోంది.
ఈ సినిమాలో రష్మిక మందన, జిమ్ సరబ్, సాయాజీ ఏక్‌నాధ్ షిండే తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి, దర్శకత్వం: శేఖర్ కమ్ముల, సంగీతం: దేవి శ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి చేస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి అమిగోస్ క్రియెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ రావు కలిసి ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. జూన్ 20న కుబేరా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.