
స్వర్గీయ బాలమురళీ కృష్ణ...పరిచయమే అవసరం లేని సంగీత విద్వాంసుడు. ఆయన పాటలు అర్ధం కాని విదేశీయులు సైతం ఆయన గందర్వగానం విని పులకించిపోయేవారు. అందుకే దేశవిదేశాలలో అనేక యూనివర్సిటీలు, ప్రభుత్వాలు ఆయన ప్రతిభకి పట్టం కడుతూ అనేక అత్యున్నత పురస్కారాలు, డాక్టరేట్ డిగ్రీలు ఇచ్చి గౌరవించాయి. దక్షిణాది రాష్ట్రాలలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళిన ఎక్కడో అక్కడ ఆయన పాటలు వినబడుతూనే ఉంటాయి. సంగీతం గురించి ఏ మాత్రం అవగాహన లేని వారు సైతం ఆయన పాటని, గాత్రాన్ని దానిలో పలికే అనేక భావాలని, గమకాలని ఆస్వాదిస్తారు. అంతటి మహనీయ సంగీత కళాకారుడు చనిపోతే రామ్ గోపాల్ వర్మ యదా ప్రకారం ఆయన గురించి కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. “నేను చిన్నప్పటి నుంచి బాచ్, బీతోవెన్, మొజార్ట్ సంగీతం వింటూ పెద్దయ్యాను కానీ ఏనాడూ కర్నాటక సంగీతం పట్ల ఆసక్తి కలుగలేదు. నేను బాలమురళీకృష్ణని అభిమానిస్తాను ఎందుకంటే ఆయన ఆ పాశ్చాత్య సంగీతం జోలికి పోలేదు!” అని ట్వీట్ మెసేజ్ పెట్టాడు.
యావత్ ప్రపంచం గౌరవిస్తున్న ఆ మహనీయుడి చనిపోయినప్పుడు ఈవిధంగా వెర్రి వాగుడు వాగడం బహుశః రామ్ గోపాల్ వర్మకి మాత్రమే సాధ్యమేమో?