
ఎటువంటి హడావుడి, అంచనాలు లేకుండా ‘ఘటికాచలం’ సినిమా ట్రైలర్ వరకు వచ్చేసింది. ఈరోజు విడుదలైన ట్రైలర్లో దెయ్యాలు, ఆత్మలు, క్షుద్ర పూజలు అంటూ చూపినా అంతకుమించి మరేదో ఉందని అర్దమవుతుంది.
ఓ మెరిట్ విద్యార్ధి నీట్ ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్ కోర్సులో చేరబోతుంటే హటాత్తుగా అతనిని ఓ ఆత్మ ఆవహించడం, దాంతో అతను హత్యలు చేస్తూ జైలు పాలవడం ట్రైలర్లో చూపారు. కానీ చదువుల ఒత్తిడి విద్యార్ధులపై ఎటువంటి విపరీత ప్రభావం చూపుతుందో ఈ సినిమా ద్వారా చూపబోతున్నట్లు ట్రైలర్ సూచిస్తోంది.
అమర్ కామేపల్లి దర్శకత్వం, స్క్రీన్ ప్లే చేసిన ఈ థ్రిల్లర్ సినిమాలో నిఖిల్ దేవాదుల, సమ్యు రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకు కధ, నిర్మాత: ఎంసీ రాజు, నివాస్ మల్కార్, సంగీతం: ఫావియో జి కుకురోల్లో, కెమెరా: ఎస్ఎస్ మనోజ్, ఎడిటింగ్: శ్రీనివాస్ బైనబోయిన చేస్తున్నారు.
ఒయాసిస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఎంసీ రాజు నిర్మించిన ఘటికాచలం మే 31న థియేటర్లలో విడుదల కాబోతోంది.