ఉస్తాద్ భగత్ సింగ్‌: త్వరలో షూటింగ్‌ షురూ

హరీష్ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’ మొదలుపెట్టి రెండు మూడేళ్ళవుతోంది. కానీ పవన్‌ కళ్యాణ్‌ ఏపీ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలతో చాలా బిజీ అయిపోవడంతో, నేటికీ ఆ సినిమా పూర్తిచేయలేకపోతున్నారు. ఇటీవలే హరిహర వీరమల్లుని పూర్తి చేయడంతో అది జూన్ 12న విడుదల కాబోతోంది.

దాని తర్వాత ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’ పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్‌ సమయం కేటాయించడంతో త్వరలోనే షూటింగ్‌ మొదలుపెట్టబోతున్నామని మైత్రీ మూవీ మేకర్స్‌ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో ప్రకటించింది.  

ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌ నటిస్తున్న పవన్‌ కళ్యాణ్‌కు జోడీగా శ్రుతీ హాసన్ నటిస్తున్నారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం: హరీష్ శంకర్‌, స్క్రీన్ ప్లే: కె.దశరద్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఆయాంకా బోస్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు. 

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి కలిసి‘ఉస్తాద్ భగత్ సింగ్‌ నిర్మిస్తున్నారు.