
మహా కుంభమేళాలో స్నానాలు చేస్తే పుణ్యం లభించినట్లే బాలీవుడ్‌కి ఓ అందాల మొనాలిస లభించింది. యూపీలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన మొనాలిసా భోస్లే ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళలో పూసల గొలుసులు అమ్ముకుంటుండగా, చాలా మంది ఆమె అందం చూసి సినీ నటి అనుకున్నారు.
బాలీవుడ్ అది నిజం చేసి సోషల్ మీడియాలో ఆమె వైరల్ అవడంతో బాలీవుడ్‌కి చెందిన కొందరు ఆమె ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళి ఆమెకు, తల్లితండ్రులకు నచ్చజెప్పి ముంబయి తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది.
ముందుగా మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టయిలిస్ట్ తదితరులు ఆమె రూపురేఖలు మార్చేయగా, ఆమె కోసం అందమైన డ్రెస్సులు తయారుచేసి ఆమె అందాన్ని మరింత పెంచారు. అలాగే చక్కగా మాట్లాడటం, హుందాతనం, నడక, నటన, డాన్స్ తదితర శిక్షణలు ఇస్తున్నారు.
ఇప్పుడు ఆమెను చూసినవారు ఒకప్పుడు కుంభమేళాలో పూసలు అమ్ముకునేది అంటే ఎవరూ నమ్మలేరు. అంతగా ఆమె రూపురేఖలు, మాట తీరు, నడత, నడక అన్నీ మారిపోయాయి.
ఇప్పటికే ఆమె కొన్ని వాణిజ్య ప్రకటనలలో నటించడం ప్రారంభించింది. తాజాగా ఉత్కర్ష్ సింగ్ అనే బాలీవుడ్ నటుడితో కలిసి ఓ మ్యూజిక్ ఆల్బమ్ చేస్తోంది. ఆమె మరింత రాణించగలిగితే ఆమె కోసం హిందీ సినిమా అవకాశాలు సిద్దంగా ఉన్నాయి కూడా.