శాతకర్ణి ఆడియో రిలీజ్ డేట్..

నందమూరి బాలకృష్ణకి చాలా ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో రిలీజ్ డేట్ వచ్చేసింది. వచ్చే నెల 16వ తేదీన తిరుపతిలో విడుదల కాబోతోంది. మరో విశేషం ఏమిటంటే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు హాజరు కాబోతున్నారు.

గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్ర ఆధారంగా తీస్తున్న ఈ చారిత్రిక చిత్రంలో బాలయ్యకి జోడీగా శ్రీయ శరణ్ నటించగా, ఆయనకి తల్లిగా ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని నటించారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని ఫస్ట్-ఫ్రేం ఎంటర్టెయిన్ మెంట్స్ బ్యానర్లో సాయిబాబు జాగర్లమూడి, వై. రాజీవ్ రెడ్డి కలిసి నిర్మించారు.

ఈ సినిమాకి సంగీతం: చిరంతన్ భట్, కెమెరా: జ్ఞాన శేఖర్, ఎడిటర్స్: సూరజ్ జగ్ తాప్, రామకృష్ణ ఆరం. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన గౌతమీపుత్ర శాతకర్ణి విడుదల కాబోతోంది.