జూన్ 27న కన్నప్ప ఫిక్స్

బాలీవుడ్‌ దర్శకుడు ముఖేష్ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో ‘కన్నప్ప’కు మంచు మనోజ్ సినిమా ‘భైరవం’ నుంచి పోటీ ఎదురవడంతో ఏప్రిల్ 25న విడుదల కావలసిన కన్నప్పని వాయిదా వేసుకున్నారు.

‘భైరవం’ ఈ నెల 30న విడుదల కాబోతున్నందున, కన్నప్ప కూడా ధైర్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కానీ ఎందుకైనా మంచిందని కాస్త గ్యాప్ ఇచ్చి జూన్ 27న కన్నప్పని విడుదల చేయబోతున్నారు. 

ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేశారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పోస్టర్ వేశారు. దానిలో జూన్ 27న కన్నప్ప రావడం ఖాయమని ఖరారు చేశారు. 

కన్నప్పలో మంచు విష్ణుకి జోడీగా బాలీవుడ్‌ నటి నుపూర్ సనన్ నటించగా బాలీవుడ్‌ నటులు అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ శివపార్వతులుగా, ప్రభాస్‌ నందీశ్వరుడుగా నటించారు. 

ఈ సినిమాలో మోహన్ బాబు, బ్రహ్మానందం, శరత్ కుమార్, మోహన్ లాల్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, స్టీఫెన్ దేవాస్సీ, కెమెరా: షెల్డన్ షావ్, ఆర్ట్: చిన్న చేస్తున్నారు.  

అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మించారు.