
నూతన దర్శకుడు సత్య బొచ దర్శకత్వంలో బాలు, షిన్నోవా, సన్విత హీరో హీరోయిన్లుగా ‘ఒక బృందావనం’ ఈ నెల 23న థియేటర్లలో విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో నిన్న ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్‌లో కొన్ని సన్నివేశాలు హృదయాన్ని తాకుతాయి.
ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూపాయ లక్ష్మీ, కళ్యాణి రాజు, వంశీ నెక్కంటి, మహేందర్, అనంత్ బాబు, మెహబూబ్ బాషా ఇతర పాత్రలు చేశారు.
సీర్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ తాటికొండ, వెంకట్ రేగట్టె, ప్రహ్లాద బొమ్మినేని, మనోజ్ ఇడుపురు కలిసి నిర్మించిన ఈ సినిమాకి సంగీతం: సన్నీ& సాకేత్, కెమెరా: రాజ్ కే నల్లి, ఎడిటింగ్: తమ్మిరాజు, సంతోష్ కామిరెడ్డి చేశారు.