ఆపరేషన్ సింధు: పాక్‌ పరేషాన్.. సినీ పరిశ్రమ టైటిల్‌ రిజిస్ట్రేషన్!

ఓ పక్క ఆపరేషన్ సింధూర్‌ దెబ్బకి పాకిస్థాన్‌ ప్రజలు, ప్రభుత్వం హడలిపోతుంటే, మరోపక్క దేశంలో పలు సినీ నిర్మాణ సంస్థలు ‘ఆపరేషన్ సింధూర్‌’ టైటిల్‌ సొంతం చేసుకునేందుకు పోటీ పడుతుండటం విశేషం. 

ఆపరేషన్ సింధూర్‌ టైటిల్‌ కోసం పోటీ పడుతున్నవాటిలో టీ సిరీస్, జీ స్టూడియోస్, మహావీర్ జైన ఫిల్మ్స్ వంటి పలు ప్రముఖ సంస్థలున్నాయి. ఇవన్నీ ఇండియం మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌లో ఆపరేషన్ సింధూర్‌ టైటిల్‌ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఒక్క బాలీవుడ్‌లోనే దీని కోసం దాదాపు 15 దరఖాస్తులు వచ్చాయి. ఇక దక్షిణాది సినీ పరిశ్రమలో ఎన్ని వస్తున్నాయో?