
మెగాస్టార్ 150వ సినిమా ఖైది నెంబర్ 150 సినిమా ఆడియోకి గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అటెండ్ అవుతాడా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. మెగా క్యాంప్ లో మేమంతా ఒక్కటే అనే సంకేతాలున్నా సరే వారు మాత్రం ఎవరికి వారు అన్న తీరున ఉంది. అందుకే మెగాస్టార్ రీ ఎంట్రీగా వస్తున్న ఖైది ఆడియోకి మెగా హీరోలను మొత్తం ఒకే వేదిక మీద నిలబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ 150వ సినిమా ఆడియోకి పవన్ కచ్చితంగా వస్తారని గట్టి టాక్ వినిపిస్తుంది.
ఆల్రెడీ పవర్ స్టార్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చాడు. అయితే ఆ తర్వాత మళ్లీ మెగా క్యాంప్ లో కాస్త తేడాలు రావడం జరిగింది. పవన్ కు వ్యతిరేకంగా బన్ని, సపోర్ట్ గా సాయి ధరం తేజ్ ఇలా ఎవరికి వారు తమకు తోచినట్టు స్పందించడం మొదలుపెట్టారు. అయితే ఈ క్రమంలో అందరిని ఒకే తాటిపై నడిపించేందుకు మెగాస్టార్ సినిమా ఆడియో వేడుక కానున్నదట.
ఒకవేళ అదే నిజంగా జరిగితే ఇక ఆ ఫంక్షన్ కు తిరుగు ఉండదని చెప్పొచ్చు. ప్రస్తుతం ఫాంలో ఉన్న మెగా హీరోలంతా ఒకే జట్టుగా కనిపిస్తే ఆ సంచలనం మాములుగా ఉండదు. మరి ఊహించినట్టుగా మెగా వేడుక జరుగుతుందో లేదా మళ్లీ ఫాన్స్ కు నిరాశనే మిగులుతుందా చూడాలి.