పెద్ది కోసం ఓ ఐటెమ్ సాంగ్‌.. శ్రీలీల చేస్తుందట!

రామ్ చరణ్‌-బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో మొదలైన ‘పెద్ది’ సినిమా క్రికెట్‌ నేపధ్యంతో తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ గ్లింమ్స్‌లో రామ్ చరణ్‌ కొట్టిన తొలి షాట్‌తోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఆ షాట్ తీసిన విధానం చూస్తే ‘పెద్ది’ సూపర్ హిట్ ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. సినీ విమర్శకులు, మీడియా కూడా పెద్ది ఫస్ట్ గ్లింమ్స్‌ని చాలా ప్రశంశించింది. అంత గొప్పగా ఉందా తొలి షాట్. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది కనుక అప్‌డేట్‌ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారికో శుభవార్త అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఐటెమ్ సాంగ్‌ చేయబోతోందట. కానీ ఈ విషయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

శ్రీలీల, రవితేజ జంటగా చేసిన మాస్ జాతర ఈ నెల 9న విడుదల కాబోతోంది. శ్రీలీలకి లక్కీ స్టార్ అని కూడా భావిస్తారు. ఆమె సినిమాలో ఉంటే తప్పకుండా హిట్ అవుతుందనే సెంటిమెంట్ కొంతమంది దర్శక నిర్మాతలలో ఉంది. కనుక వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజకి శ్రీలీల వలన మాస్ జాతర హిట్ అవుతుందో లేదో మే 9న తెలుస్తుంది.