
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో తాను మొదలుపెట్టిన మూడు సినిమాలు హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఇంతవరకు పూర్తి చేయలేకపోయారు.
వీటిలో హరిహర వీరమల్లు మే 9న ఎట్టి పరిస్థితులలో విడుదల చేస్తామని నిర్మాత ఏఎమ్ రత్నం చెప్పినప్పటికీ, పవన్ కళ్యాణ్ చేయాల్సిన సన్నివేశాలు పూర్తికాకపోవడంతో మళ్ళీ మరోసారి వాయిదా పడబోతోంది.
సినిమా విడుదల చేయాల్సిన సమయంలో హరిహర వీరమల్లు షూటింగ్ మొదలవుతుందనే వార్త విని ప్రేక్షకులు, అభిమానులు సంతోషించలో బాధపడాలో తెలీని పరిస్థితి.
పవన్ కళ్యాణ్ నేటి నుంచి షూటింగ్‌కు హాజరయ్యి తాను నటించాల్సిన సన్నివేశాలను పూర్తిచేయబోతున్నారని తాజా సమాచారం. ఒకవేళ పవన్ కళ్యాణ్ మళ్ళీ బ్రేక్ తీసుకోకుండా సినిమా పూర్తి చేయగలిగితే కనీసం వచ్చే నెలలో విడుదల చేయగలుగుతారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్ చేస్తున్నారు.
హరిహర వీరమల్లు సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్‌లో ఏఎం రత్నం రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ లెవెల్లో 5 భాషల్లో నిర్మిస్తున్నారు.