
ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీనటులు, దర్శక నిర్మాతలు, రచయితలు ప్రవేశిస్తుండటంతో అచ్చ తెలుగులో సినిమా పేర్లు, విలక్షణమైన కధలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అటువంటిదే గుర్రం పాపిరెడ్డి కూడా. సినిమా పేరు ప్రకటిస్తూ, విడుదల చేసిన విలక్షణమైన ఫస్ట్ గ్లింమ్స్ చాలా ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాలో నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, యోగిబాబు,బ్రహ్మానందం, రాజ్ కుమార్ కసిరెడ్డి, వంశీధర్ కోస్గీ, జీవన కుమార్, జాన్ విజయ్ దేవరకొండ, మొట్ట రాజేంద్రన్ నటిస్తున్నారు.
ఈ సినిమాకు కధ: పూర్ణ ప్రజ్ఞ, దర్శకత్వం: మురళీ మనోహర్, కెమెరా: అర్జున్ రాజా, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్ చేస్తున్నారు.
డా.సంధ్య గోలి సమర్పణలో వెనురెడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.