చిరుకి జోడీగా నయనతార?

మెగాస్టార్ చిరంజీవి-అనిల్‌ రావిపూడి సినిమా గత నెల ఉగాది పండుగ రోజున లాంఛనంగా పూజా కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవడంతో త్వరలోనే షూటింగ్‌ మొదలు పెట్టబోతున్నారు.

ఈ సినిమాలో చిరంజీవి పాత్ర పేరు ఆయన అసలు పేరు శివశంకర వరప్రసాద్‌. చిరంజీవికి జోడీగా నయనతార చేసే అవకాశం ఉంది. దర్శక నిర్మాతలు ఆమెతో మాట్లాడారు. ఆమె ఇదివరకే సమరసింహా రెడ్డి, గాడ్ ఫాదర్ సినిమాలలో చిరంజీవితో కలిసి నటించారు. కనుక ఈ సినిమాకు ఓకే చెప్పడం ఖాయమే. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. మరో హీరోయిన్‌ని ఇంకా ఖరారు చెయ్యలేదు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్‌ ఓ అతిధి పాత్రలో నటించబోతున్నారు.

అనిల్‌ రావిపూడికి సంక్రాంతి సెంటిమెంట్ ఏర్పడటంతో ఈ సినిమాని 2026 సంక్రాంతి పండుగకి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో.