అవును.. తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ తీయబోయే సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించబోతున్నారు. సాయి కిరణ్ తండ్రి బాటలో వెళ్ళి రాజకీయాలలో ప్రవేశించారు కానీ ఎదురుదెబ్బ తగలడంతో సినీ నిర్మాణ రంగంలో ప్రవేశించి విశ్వక్ సేన్‌తో మొదటి సినిమా తీస్తున్నారు.
విశ్వక్ సేన్ తొలిసారిగా అమ్మాయి వేషంలో నటించిన ‘లైలా’ ఫ్లాప్ అవడంతో తీవ్ర నిరాశ చెందారు. ప్రస్తుతం ‘జాతి రత్నాలు’ దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో ‘ఫంకీ’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కాయడు లోహర్ హీరోయిన్‌గా చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనుదీప్, సంగీతం: భీమ్స్ సీసీరిలియో, కెమెరా: సురేష్ సంగం, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు.
దీని తర్వాత సినిమా తలసాని సాయి కిరణ్‌తో చేయబోతున్నారు. ఈ సినిమాకు ‘కల్ట్’ అని టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.