.jpg)
వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా ‘రాబిన్‌హుడ్’చాలా భారీ అంచనాలతో మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ని కూడా ఈ సినిమాలో నటించడంతో ఆయన కోసమైన క్రికెట్ అభిమానులు సినిమా చూసేందుకు వస్తారని, తప్పక సూపర్ హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ ప్రేక్షకులని రాబిన్ హుడ్ మెప్పించలేకపోవడంతో సినిమా యావరేజ్ అనిపించుకుంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులు జీ5 ఓటీటీ తీసుకుంది. సినిమా విడుదలై 4 వారాలు పూర్తయినందున రేపు ‘మే డే’ కార్మిక దినోత్సవం సందర్భంగా ఓటీటీలోకి వస్తుందనుకుంటే ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. సాధారణంగా ఓటీటీలో సినిమాలు శుక్రవారం విడుదలవుతుంటాయి. కనుక మే 2 లేదా 9న (శుక్రవారం) విడుదల చేస్తారేమో?
ఈ సినిమాలో నితిన్‌కి జోడీగా డాన్సింగ్ క్వీన్ శ్రీలీల నటించింది. రాజేంద్ర ప్రసాద్, శుభలేఖ సుధాకర్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, దేవదత్త నాగే, మీమ్ గోపి, షిజు, షైన్ టామ్ చాకో, కేతికా శర్మ తదితరులు ముఖ్య పాత్రలు చేసి మెప్పించారు. కానీ కధ, కధనం మెప్పించలేకపోవడంతో బోర్లా పడింది.
థియేటర్లలో బోర్లా పడిన సినిమాలు ఓటీటీలో మంచి ఆదరణ పొందినవి చాలా ఉన్నాయి. కనుక ఓటీటీ ప్రేక్షకులు రాబిన్ హుడ్‌కి మంచి మార్కులు వేస్తారో లేదో విడుదలైతే తెలుస్తుంది.