.jpg)
శైలేష్ కొలను దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా చేసిన ‘హిట్-3’ సినిమా రేపు (మే 1)న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాని బారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా నిర్మించినందున చిత్ర నిర్మాతల అభ్యర్ధన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతిస్తూ నేడు ఉత్తరువులు జారీ చేసింది.
రేపు సినిమా విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రస్తుతం ఉన్న టికెట్ ఛార్జీకి అదనంగా జీఎస్టీతో కలిపి రూ.50 చొప్పున, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. జీఎస్టీతో కలిపి రూ.75 చొప్పున పెంచుకునేందుకు అనుమతించింది.
పుష్ప-2 విడుదలైనప్పుడు సంధ్య థియేటర్ ఘటన తదనంతర పరిణామాల వలన తెలంగాణ రాష్ట్రంలో ఎంత భారీ బడ్జెట్ సినిమాలకైనా టికెట్ ఛార్జ్ పెంచుకునేందుకు, బెనిఫిట్ షోలు వేసుకునేందుకు అనుమతించబోమని సిఎం రేవంత్ రెడ్డి శాసనసభలోనే ఖరాఖండీగా చెప్పేసినందున నిర్మాతలు కూడా ప్రభుత్వాన్ని అభ్యర్ధించడం మానుకున్నారు.