దుల్కర్, సముద్రఖని సినిమా టైటిల్‌: కాంత

సల్మాన్ దుల్కర్, సముద్రఖని ప్రధాన పాత్రలలో తెలుగు, తమిళ్ భాషలలో ఓ సినిమా చేయబోతున్నారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో తీస్తున్న ఈ సినిమాకి ‘కాంత’ అనే టైటిల్‌ ఖరారు చేసి, సముద్రఖని ఫస్ట్-లుక్‌ విడుదల చేశారు. సముద్రఖని బ్లాక్ అండ్ వైట్‌ ఫోటో చాలా వెరైటీగా ఉంది.   

ఈ సినిమాలో సల్మాన్ దుల్కర్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. స్పరిట్‌ మీడియా, వేఫేరర్ ఫిలిమ్స్ బ్యానర్లపై ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి, సల్మాన్ దుల్కర్‌,  ప్రశాంత్ పొట్లూరి, జోమ్  వర్గీస్ నిర్మాతలు. 

ఈ సినీయమకు సంగీతం: జాను చంతర్, కెమెరా: డాని లోపెజ్, ఆర్ట్: రామలింగం, ఎడిటింగ్: లీవేన్ ఆంథోనీ గాన్‌సాల్వేస్ చేస్తున్నారు.