జూ.ఎన్టీఆర్‌-నీల్‌ సినిమాలో శృతి హాసన్ స్పెషల్

జూ.ఎన్టీఆర్‌-ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న సినిమాలో శ్రుతీ హాసన్ స్పెషల్ సాంగ్‌కు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా చేసిన ‘సలార్’ సినిమాలో కూడా ఆమె ముఖ్య పాత్ర చేశారు. సలార్-2లో....ఇప్పుడు జూ.ఎన్టీఆర్‌ సినిమాలో కూడా శృతి హాసన్‌ని తీసుకోవడం చూస్తే దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు ఆమె సినిమాలో ఉంటే తప్పకుండా సూపర్ హిట్ అవుతుందనే సెంటిమెంట్ ఏర్పడిన్నట్లుంది. ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్‌కి జోడీగా కన్నడ నటి రుక్మిణీ వసంత్ చేస్తున్నారు. 

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ పోలిశెట్టి ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరి కృష్ణ కొసరాజు కలిసి పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని 2026 జనవరిలో విడుదల చేస్తామని దర్శకుడు ప్రశాంత్ నీల్‌ ముందే ప్రకటించారు.