ఆహాలో శివంగి.. చూశారా?

దేవరాజ్ భరణి దర్శకత్వంలో వరలక్ష్మీ శరత్ కుమార్‌, ఆనంది ప్రధాన పాత్రలలో నటించిన శివంగి మార్చి 7న విడుదలైంది. స్క్రీన్ ప్లే, నటీనటుల నటనతోనే థియేటర్‌ ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను మెప్పించేందుకు ‘ఆహా’లో వచ్చేసింది. 

గురువారం నుంచే శివంగి తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో ప్రసారం అవుతోంది. శుక్రవారం నుంచి తమిళ్ వెర్షన్ కూడా ప్రసారం కాబోతోంది. క్రైమ్ హర్రర్ జోనర్‌లో తీసిన ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ విజయ్ దేవరకొండ, దా. కోయ కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.  

ఈ సినిమాకు కధ, దర్శకత్వం, కెమెరా: దేవరాజ్ భరణి ధారణ, సంగీతం: ఏహెచ్ కశ్యప్ చేశారు. ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్‌పై నరేష్ బాబు పంచుమర్తి ఈ సినిమా నిర్మించారు.