దర్శకుడు జ్యోతి కృష్ణ ‘హరిహర వీరమల్లు’ గురించి ఓ ఆసక్తికరమైన విషయం మీడియాతో పంచుకున్నారు. చారిత్రిక నేపధ్యంతో తీస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తుండటమే కాక ఓ పాట పాడిన సంగతి అందరికీ తెలిసిందే.
అంతేకాదు ఈ సినిమాలో ఆరు యాక్షన్ సన్నివేశాలలో ఓ సన్నివేశానికి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించారని జ్యోతి కృష్ణ చెప్పారు. సుమారు 20 నిమిషాలపాటు సాగే ఈ యాక్షన్ సన్నివేశంలో 1100 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారని చెప్పారు.
ఈ ఒక్క యాక్షన్ సీన్ షూటింగ్ పూర్తి చేసేందుకే తమకు 61 రోజులు పట్టిందని చెప్పారు. అంతమందితో అన్ని రోజుల పాటు షూటింగ్ జరిగినా పవన్ కళ్యాణ్ ఏమాత్రం తడబడకుండా చాలా చక్కగా పూర్తి చేశారు.
దీని కోసం పలువురు అంతర్జాతీయ స్టంట్ డైరెక్టర్లతో మాట్లాడి సలహాలు తీసుకొని పూర్తి చేశారని దర్శకుడు జ్యోతి కృష్ణ చెప్పారు. పవన్ కళ్యాణ్ మొదటిసారిగా ఈ సినిమాలో గుర్రపు స్వారి చేశారు కనుక దానిలో కూడా శిక్షణ తీసుకున్నారని చెప్పారు. హరిహర వీరమల్లు సినిమాలో ఈ యాక్షన్ సీన్ హైలైట్‌గా నిలుస్తుందని జ్యోతి కృష్ణ చెప్పారు.
ఈ సినిమాలో నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్‌కి జోడీగా నటించగా బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్, విక్రమ్ జీత్, జిష్ణుసేన్ గుప్తా, నోరాహి ఫతేహి, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
హరిహర వీరమల్లులో దర్శకుడు క్రిష్ పూర్తిచేయగా మిగిలిన సన్నివేశాలను జ్యోతీ కృష్ణ దర్శకత్వంలో పూర్తి చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, జ్యోతి కృష్ణ, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్‌లో ఏఎం రత్నం రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తీస్తున్న హరిహర వీరమల్లు మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.