సంబంధిత వార్తలు

కోలీవుడ్ యాక్షన్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్, త్రిష జంటగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా తెలుగు వెర్షన్ టీజర్ ఇటీవల విడుదల చేయగా ‘గాడ్ బ్లెస్ యూ...’ అంటూ సాగే మాస్ బీట్ సాంగ్ విడుదల చేశారు. కృష్ణ కాంత్ వ్రాసిన ఈ పాటని జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచి సంగీతం అందించగా నకాష్ అజీజ్ బృందం ఆలపించింది.
అధ్విక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తీసిన ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: అభినందన రామానుజన్, స్టంట్స్: సుప్రీం సుందర, కాలోయిన్ వడేనిచరోవ్, ఎడిటింగ్: విజయ్ వేలుకుట్టి చేశారు. ఈ సినిమా రేపు ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది.