జూ.ఎన్టీఆర్ దేవర తర్వాత ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాగా ముందే చెప్పిన్నట్లు ఏప్రిల్ 22 నుంచి జూ.ఎన్టీఆర్ కూడా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ స్వయంగా ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్‌కి జోడీగా కన్నడ భామ రుక్మిణీ వసంత్ నటించబోతోంది.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి పాన్ ఇండియా మూవీగా దీనిని తెరకెక్కించబోతున్న ఈ సినిమాని 2026 జనవరిలో విడుదల చేస్తామని దర్శకుడు ప్రశాంత్ నీల్ ముందే ప్రకటించారు. కనుక అక్టోబర్ లేదా నవంబర్‌లోగా సినిమా షూటింగ్, డిసెంబర్ నెలాఖరులోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ టార్గెట్ ప్రకారమే ప్రశాంత్ నీల్ ముందే షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ ప్లాన్ చేసుకున్నారు.
#NTRNeel is entering its most explosive phase 💥💥
Man of Masses @Tarak9999 steps into the destructive soil from April 22nd ❤️🔥❤️🔥#PrashanthNeel @MythriOfficial @NTRArtsOfficial @NTRNeelFilm pic.twitter.com/z7hsCkhOY0