7/జీ బృందావన్ కాలనీ సీక్వెల్‌ అప్‌డేట్‌

ప్రముఖ కోలీవుడ్‌ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో 2004 లో వచ్చిన 7/జీ బృందావన్ కాలనీ సూపర్ హిట్ అయ్యింది. అప్పుడే ఆ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని చెప్పినప్పటికీ ఇంతవరకు రాలేదు.

ఓ తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు సెల్వ రాఘవన్‌ని ఇదే ప్రశ్న అడిగితే సినిమా షూటింగ్‌ 50 శాతం పూర్తయిపోయిందని చెప్పారు. ఈ సినిమాలో రవికృష్ణ హీరోగా నటిస్తున్నాడు. మొదటి భాగంలో హీరో ఖదీర్‌కి ఉద్యోగం రావడంతో ఒంటరివాడుగా మిగిలిపోయిన్నట్లు చూపాము. అక్కడి నుంచే రెండో భాగం మొదలు పెట్టి పదేళ్ళలో అతని జీవితం ఏవిదంగా మారుతుందో  చూపుతాము. ఈ సీక్వెల్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. 

కార్తి, ధనుష్ ప్రధాన పాత్రలలో ‘యుగానికి ఒక్కడు’ సినిమాకి కూడా సీక్వెల్‌గా తీయాలనుకుంటున్నామని, కానీ ఇది చాలా భారీ బడ్జెట్‌ సినిమా కనుక నిర్మాత దొరికితే మొదలుపెడతామని దర్శకుడు సెల్వ రాఘవన్ చెప్పారు.

7/జీ బృందావన్ కాలనీ సీక్వెల్‌ షూటింగ్‌ 50 శాతం పూర్తయింది కనుక మరో 3-4 నెలల్లో మిగిలినది కూడా పూర్తి చేయగలిగితే దసరా, దీపావళి పండుగల సమయానికి విడుదలయ్యే అవకాశం ఉంది.