గర్ల్ ఫ్రెండ్‌ టీజర్‌ ఆడియో సాంగ్‌

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన ఇద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కనుక ఆమె నటిస్తున్న గర్ల్ ఫ్రెండ్ సినిమా టీజర్‌ని విజయ్ దేవరకొండ చేతే విడుదల చేయించారు. శనివారం టీజర్‌ ఆడియో సాంగ్‌ విడుదల చేశారు. 

వరదరాజ్ చిక్కబళ్లాపుర వ్రాసిన ఈ పాటని హేషమ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచి చిన్మయి శ్రీపాద, దీక్షిత శెట్టితో కలిసి పాడారు.  

 ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాలో రష్మిక మందన, దీక్షిత్ శెట్టి జంటగా నటించారు. ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: కృష్ణన్ వసంత్, ఎడిటింగ్: ఛోటా కే ప్రసాద్ చేస్తున్నారు. 

గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని కలిసి ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలొ పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.