మోదికి సపోర్ట్ గా లిరిసిస్ట్ ఏమన్నాడంటే..!

నల్లధన నిర్మాలనలో భాగంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోది తీసుకున్న 500, 1000 నోట్ల రద్దు కార్యక్రమంపై అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. జనాలు ఇబ్బంది పడుతున్నారని కొందరు వారు తరపున ఒకాళ్తా పుచ్చుకుని వారి నిర్ణయాన్ని బయట పెట్టేస్తున్నారు. అయితే సెలబ్రిటీస్ మోది నిర్ణయాన్ని స్వాగతించారు. ఇక ప్రత్యేకంగా తెలుగు లిరిసిస్ట్ అనంత్ శ్రీరాం తన రచనలతో మోదికి కృతజ్ఞత తెలిపాడు.

మోది సర్కార్ కు మద్ధతు అందిస్తూ కాస్త వ్యంగంగా నోట్ల రద్దు గురించి ప్రస్థావించడం జరిగింది. ‘ఎవడో వచ్చి ఏదో చేస్తాడని ఎదురు చూస్తుంటాం.. నిజంగానే ఎవడైనా ఏదైనా చేస్తుంటే మాత్రం ఎద్దేవా చేస్తాం… భారతీయులమండి.. మేం భారతీయులం’ అంటూ పదునైన మాటలను వాడిన అనంత్ శ్రీరాం 'మకిలీ పట్టిన దేశాన్ని కడిగేయాలంటాం.. మా కడుపులో నీళ్లు మాత్రం కదలకూడదంటాం' అంటూ నోట్ల రద్దుని వ్యతిరేకిస్తున్న వారికి తన చురకలంటించాడు.  ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న అనంత్ శ్రీరాం వీడియో అందరిని ఆలోచింపచేస్తుంది.