
అదేంటి నితిన్, అఖిల్ మంచి స్నేహితులు కదా మారి వారిద్దరు ఎందుకు ఫైటింగ్ చేస్తారు అంటే.. ఓ హీరోయిన్ విషయంలో ఇద్దరి మధ్య పోటీ నెలకుందట. నితిన్ హను రాఘవపూడి డైరక్షన్లో చేస్తున్న సినిమాకు కోలీవుడ్ హీరోయిన్ మేఘ ఆకాష్ ను సెలెక్ట్ చేశారు. అయితే ఆమెను చూసిన అఖిల్ తన సినిమాలో కూడా ఆమెనే కావాలని విక్రం కుమార్ కు చెప్పాడట. విక్రం కుమార్ కూడా కన్విన్స్ అవడంతో మేఘ ఆకాష్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఇప్పటికే నితిన్ సినిమా దాదాపు ఓకే చేసిన మేఘ సడెన్ గా వచ్చిన అఖిల్ ఆఫర్ తో సర్ ప్రైజ్ అవుతుందట. తెలుగులో మొదటి రెండు సినిమాలకే ఇంత పోటీ ఏర్పడ్డ భామ ఈమె ఒక్కతే కావొచ్చు. మేఘ కనుక ఈ రెండు ఆఫర్లను వాడుకుంటే ఆమెకు టాలీవుడ్ లో తిరుగుండదని చెప్పొచ్చు. ప్రస్తుతం నితిన్ సినిమా కోసం డైరక్టర్ హను లొకేషన్స్ కోసం గాలిస్తుంటే విక్రం మాత్రం అఖిల్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనిలో ఉన్నాడు.
నితిన్, అఖిల్ ఈ ఇద్దరిలో ఎవరి సినిమా క్లిక్ అయినా మేఘకు టాలీవుడ్లో ప్రత్యేక క్రేజ్ వచ్చేసినట్టే. కోలీవుడ్లో నటిస్తున్న ధనుష్ సినిమా రిలీజ్ అవ్వకుండానే ఆమెకు ఈ రేంజ్లో ఇమేజ్ ఏర్పడింది అంటే ఇక సినిమా రిలీజ్ అయ్యాక కోలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ఆమె కోసం క్యూ కట్టక తప్పదు. హిట్ కొట్టకుడానే మ్యాజిక్ చేస్తున్న మేఘ సినిమాల ఫలితాలను అదే రేంజ్లో అందుకుంటుందేమో చూడాలి.